అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు వణికిస్తోంది. వేగంగా వీస్తోన్న గాలులు కూడా తోడు కావడంతో పలు ప్రాంతాల కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కెనడాతోపాటు, హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. తాజాగా అమెరికా రాజధాని వాషింగ్టన్ వైపు కార్చిచ్చు దూసుకువస్తోంది. రాజధాని వాషింగ్టన్లో వేలాది మందిని, ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాషింగ్టన్లోని స్పోకాన్ ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు గంటల వ్యవధిలోనే 3 వేల ఎకరాలకు విస్తరించింది. బలమైన గాలులతో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోందని వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ప్రకటించింది. ఈ కార్చిచ్చు వల్ల వేలాది ఇళ్లు కాలిపోయాయి. వాషింగ్టన్ మెడికల్ లేక్ ప్రాంతంలో అధికారులు లెవెల్ 3 అలర్ట్ జారీ చేశారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఫోర్ లేక్స్ పట్టణానికి కూడా లెవెల్ 3 ఆదేశాలు జారీ చేశారు. స్పోకాన్, చెనెయ్ ప్రాంతాలకు లెవెల్ 2 అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో పెరిగిపోయిన ఉష్ట్రోగ్రతలు, వర్షాభావ పరిస్థితులకుతోడు, విపరీతంగా వీస్తోన్న గాలులు కార్చిచ్చును మరింత పెంచుతున్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు