జన్‌ధన్ యోజన(PMJDY) బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను దాటింది. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆధ్వర్యంలోప్రారంభించిన ఈ పథకం గ్రామీణులకు
వరంలా మారింది. ముఖ్యంగా మహిళలు బ్యాంకింగ్ సేవలువినియోగించుకునేందుకు సాయ పడింది.
2023
ఆగస్టు 9 నాటికి ఈ ఖాతా ద్వారా ప్రయోజనంపొందుతున్న వారి సంఖ్య 50 కోట్లు దాటింది. ఇందులో 56 శాతం మంది మహిళలే ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు
చిన్నపట్టణాలకు చెందిన 67 శాతం మంది జన్ ధన్ ఖాతాలతోలబ్ధి పొందారు. రూ.2.03 లక్షల కోట్లు ఈ ఖాతాల్లో
డిపాజిట్టు చేయగా, 34 కోట్ల రూపేకార్డులు ఖాతాదారులకు బ్యాంకులు
ఉచితంగా అదజేయడం గమనార్హం. PMJDY ఖాతాల సరాసరి బ్యాలెన్స్ రూ.4,076గాఉండగా, 5.5 కోట్ల మంది నేరుగా లబ్ధి
పొందుతున్నారు.
పేదరికనిర్మూలనతో పాటు దేశఆర్థిక స్వరూపం
మెరుగుపడేందుకు జన్ ధన్ ఖాతాలు దోహదపడ్డాయి.బ్యాంకింగ్ లావాదేవీలు కూడా
సంతృప్తస్థాయిలో జరిగాయి. ప్రభుత్వ పథకాల సాయాన్నిలబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో
వేయడంతో పాటు అధునాతన సాంకేతికత అనుసంధానంతో పేదలకు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా మంచిచేకూరింది.
అర్హతకల్గిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా
ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ప్రారంభించడంతో పాటుఎలాంటి ఛార్జీలు లేకుండానే రూపే
కార్డులు జారీ చేశారు. అలాగే రూ. 2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించడంతో పాటు పదివేల రూపాయల వరకు
ఓవరు డ్రాఫ్ట్ కుఅవకాశమిచ్చారు.
జన్ ధన్
ఖాతాలు 50 కోట్ల మైలురాయిని చేరుకోవడంపైప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఖాతాల్లో సగభాగం
నారీశక్తికి చెందినివి కావడం సంతోషించ దగ్గ విషయంఅన్నారు. దీని ద్వారా
ప్రతిఒక్కరికీ ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు