ఒకప్పటి ట్విట్టర్ ప్రస్తుత ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్‌లో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్ తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అందుకే తొలగిస్తున్నట్టు మస్క్ వెల్లడించారు. భద్రత విషయంలో బ్లాక్ చేసే ఫీచర్ చాలా ముఖ్యమైంది. దీన్ని తొలగించడంపై యూజర్లు ఆందోళన చెందుతున్నారు. దీన్ని తొలగిస్తే ఆన్లైన్లో వేధింపులు పెరిగిపోతాయని యూజర్లు భావిస్తున్నారు.
త్వరలోనే ఎక్స్ ప్లాట్‌ఫాంలో బ్లాక్ చేసే ఫీచర్ తొలగిస్తామని సంస్థ అధినేత మస్క్ ప్రకటించారు. నేరుగా మెసేజ్‌లు చేసే వారిని మాత్రం బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. బ్లాక్ బదులు మ్యూట్ ఫీచర్ ఉపయోగించాల్సి ఉంటుందని మస్క్ వెల్లడించారు. ఎవరినైనా దూరం పెట్టాలనుకుంటే వారి ఖాతాను మ్యూట్ చేస్తే వారి పోస్టులు మనం చూడకుండా ఉండటానికి వీలవుతుందన్నారు. ఖాతాదారుడు ఎవరినైనా మ్యూట్ చేసినా, తను చేసిన పోస్టులను మ్యూట్ చేసిన వ్యక్తి చూడవచ్చు. అతని ఫాలోవర్లకు కూడా పంపించుకోవచ్చు.
ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి వెళ్లాక అందులో అనేక మార్పులు చేశారు. ట్విట్టర్ పేరు ఎక్స్‌గా మార్చడంతోపాటు, వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. ఇక టిక్ మార్క్ కావాలంటే కొంత మొత్తం చెల్లించుకోవాలనే నిబంధన కూడా తీసుకువచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు