మణిపూర్లో మరోసారి రగడ మొదలైంది. శుక్రవారంనాడు తాజాగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు చనిపోవడంతో కుకీలు రోడ్డెక్కారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ( ఏఎఫ్ఎస్పిఎ ) మరలా ప్రయోగించాలంటూ కుకీ తెగకు చెందిన వందలాది మహిళలు 2వ నెంబరు జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. ఉక్రుల్ జిల్లాలో శుక్రవారంనాడు ముగ్గురు కుకీలను చంపివేసిన ఘటనతో మణిపూర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన జరిగిన తరవాత వందలాది మంది కుకీ తెగకు చెందిన మహిళలు కంగ్పోక్పీ జిల్లాలో 2వ నెంబరు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నిన్న మొదలైన మహిళల నిరసనలు నేడు కూడా కొనసాగుతున్నాయి. హింస జరిగిన ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ బలగాలను రంగంలోకి దింపాలని కుకీలు డిమాండ్ చేస్తున్నారు.
మణిపూర్లో ఏఎఫ్ఎస్పి చట్టాన్ని మరలా ప్రయోగించాలని ట్రైబల్ యూనిటీ కమిటీ డిమాండ్ చేసింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని, లేదంటే అస్సాం రైఫిల్స్ బలగాలను ఇప్పటికే ఉపసంహరించిన జిల్లాల్లో మరలా దించాలని ట్రైబల్ యూనిటీ కమిటీ మీడియా కో ఆర్డినేటర్ లున్ కిప్జెన్ డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు