డ్రైవింగ్
లైసెన్స్, ఆర్సీ కార్డుల విషయంలో రవాణాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై
కార్డులు బదులు డిజిటల్ సాఫ్ట్ కాపీలే సరిపోతాయని అధికారిక ఉత్తర్వులు జారీ
చేసింది. లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి
వరకు రూ.200, పోస్టల్ ఖర్చుల నిమిత్తం రూ. 25 కలిపి మొత్తం రూ. 225 వసూలు
చేసేవారు. ఇప్పుడు ఈ ఛార్జీలు వసూలు చేయడ లేదు. ఇప్పటికే చెల్లించినట్లైతే వారికి
త్వరలో కార్డులు అందజేస్తారు.
కేంద్రప్రభుత్వం
‘వాహన్ పరివార్’ తో సేవలన్నీ ఆన్ లైన్ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులు తొలగించి,
డిజిటల్ పత్రాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే
విధానాన్ని అమలు చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేసే పోలీసులు, రవాణశాఖ అధికారులకు
డౌన్ లోడ్ చేసిన కాపీలు చూపిస్తే సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు