2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్
గాంధీ అమేఠీ నుంచే పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్
స్పష్టం చేసారు. అజయ్ రాయ్ ఇవాళ వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ అమేఠీ నుంచి రాహుల్
పోటీ విషయాన్ని ధ్రువీకరించారు.
అజయ్ రాయ్ కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ పార్టీ
అధ్యక్షుడిగా నిన్ననే నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
అజయ్ రాయ్‌ని యూపీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు, ఆ నియామకం తక్షణమే అమల్లోకి
వచ్చినట్టు పార్టీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ రాయ్ 2014, 2019
ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలో నరేంద్ర మోదీపై పోటీ చేసి రెండుసార్లూ ఓడిపోయారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన నేపథ్యంలో అజయ్
రాయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ అమేఠీ నుంచే పోటీచేస్తారని వెల్లడించారు. 2024
ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని వినిపిస్తున్న ఊహాగానాల పైన కూడా అజయ్
స్పందించారు. ప్రియాంక తనకు నచ్చిన నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని అజయ్
చెప్పారు. ‘‘ప్రియాంకకు వారణాసి నుంచి పోటీ చేయాలని ఉంటే అక్కడినుంచే పోటీ చేస్తారు.
ఆమెను గెలిపించడానికి పార్టీ కార్యకర్తలందరూ పని చేస్తారు’’ అని అజయ్
వ్యాఖ్యానించారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో
రాహుల్ అమేఠీలో ఓడిపోయారు. అయితే కేరళలోని వేనాడ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ
చేసి, అక్కడ గెలవడంతో పార్లమెంటులోకి అడుగు పెట్టగలిగారు. మోదీపై వ్యాఖ్యల కేసులో సుప్రీం
తీర్పు పెండింగ్‌లో ఉంది. ఆ తీర్పు వ్యతిరేకంగా వస్తే, రాహుల్‌కు 2024 పార్లమెంటు
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఉండదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు