చంద్రయాన్-3
విజయం దిశగా దూసుకెళ్తోంది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్ విక్రమ్,
చంద్రుడి ఉపరితల ఫొటోలను తీసింది. వీటిని ఇస్రో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
వ్యోమనౌకలో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన కొద్దిసేపటికే ఈ పోటోలను
తీసింది.
జాబిల్లి
ఉపరితలంలో బిలాలు కూడా ఫొటోలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్యాబ్రీ,
గియార్డనో బ్రునో, హర్కేబి జే బిలాలను గుర్తించింది.
చంద్రుడి
కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లికి అత్యంత సమీపంలోకి వెళ్లింది.
ఇవాళ సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ విజయవంతం కావడంతో ఈ కీలకమైలురాయిని దాటింది. తాజా విన్యాసంతో
ల్యాండర్ మాడ్యూల్ తన కక్ష్యను 113kmx157km కు తగ్గించుకుంది. మరో బూస్టింగ్ ప్రక్రియను ఆగస్టు 20
తెల్లవారుజాము 2 గంటలకు చేపడతారు. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడి
దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెడుతుంది.