వీల్
చైర్ నుంచే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్
పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో జులై 29న పాల్గొని జైపూర్లో నివాసానికి వెళుతుండగా
అశోక్ గెహ్లాత్ గాయపడ్డారు. స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా రెండు కాళ్ల
వేళ్లు విరిగినట్లు నిర్ధారించి చికిత్స అందజేశారు. అప్పటి నుంచి ఇంటి దగ్గరి
నుంచి అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీల్ చైర్ నుంచి అధికారులకు ఆదేశాలు
జారీ చేస్తున్నారు.
కోటాతో
పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ సమీక్ష నిర్వహణకు
సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక
మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
రాజస్థాన్ లోని కోటాలోనే గత ఎనిమిది నెలల్లో 20
మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు విద్యాశాఖ అధికారులు, కోచింగ్ సెంటర్ల
నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్లు రాజస్థాన్ సీఎం తెలిపారు.
యువ
మహాపంచాయత్ లో ప్రసంగించిన సీఎం, విద్యార్థులపై ఒత్తిడి పెంచేలా తల్లిదండ్రులు
వ్యవహరించడం సరికాదన్నారు. చిన్నతనంలో ఎంతో కష్టపడి అర్ధరాత్రి దాటే వరకు చదివినా
తాను డాక్టర్ కాలేకపోయానని చెప్పారు. అయినా అధైర్యపడలేదన్నారు. సామాజిక
కార్యకర్తగా మారి రాజకీయాల్లో ప్రవేశించి సీఎం స్థాయికి ఎదిగినట్లు వివరించారు.
వరుస ఆత్మహత్యలతో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం ..
కోటాలోని అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్
వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు