వరల్డ్
టూరిజంలో ఏపీకి ప్రత్యేక స్థానం ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
విజయవాడలో కొత్తగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించిన సీఎం జగన్,
విజయవాడతో పాటు రాష్ట్రమంతా ప్రసిద్ధి చెందిన హోటళ్లు విస్తరిస్తే ప్రపంచ పర్యాటక
మ్యాప్‌లో ఏపీకి మంచి గుర్తింపు ఉంటుందన్నారు.
రాష్ట్రంలో
హోటల్స్ స్థాపించే సంస్థలను ప్రొత్సహించి రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపిన సీఎం
జగన్.. ఒబెరాయ్ హోటల్ మొదలు కొని హయత్ ప్లేస్ వరకు మొత్తం 11 పెద్ద సంస్థలు రాష్ట్రంలో
బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు
పెట్టేందుకు ఆసక్తి చూపే వారందరికీ ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు
ఉంటాయన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు