దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకు పంచాయతీలే
పునాదులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డామన్ అండ్ డయ్యూలో జరుగుతున్న క్షేత్రీయ
పంచాయతీరాజ్ పరిషత్ సమావేశాలను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు.
‘‘సామాన్య మానవుడి కష్టాలు తీర్చే దిశగా జిల్లా
పంచాయతీ సభ్యులు కృషి చేయాలి. మీ మీ రాష్ట్రాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు
పడడానికి మీ వంతు పనిచేయాలి. మీ జిల్లాలోని పిల్లలు 10, 12 తరగతుల్లో బోర్డు
పరీక్షల్లో అగ్రస్థానంలో నిలవడానికి ఏం చేయాలో మీరు ఆలోచించాలి. మీ జిల్లాలోని
చిన్నారులు క్రీడారంగంలో రాణించేందుకు ప్రోత్సహించాలి.’’ అని మోదీ పంచాయతీరాజ్
సభ్యులకు పిలుపునిచ్చారు.
‘‘వ్యవస్థ, విలువలు, అంకితభావం అనే అంశాలను మనం
విశ్వసిస్తాం. సమష్టి బాధ్యత దిశగా మనం ముందడుగు వేస్తున్నాం. మన బాధ్యతలను
సక్రమంగా నెరవేర్చేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు
పెంచుకుంటున్నాం.’’ అని మోదీ వివరించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మొదటిరోజైన
ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ కృషి
వల్ల కేవలం బీజేపీలో మాత్రమే కాకుండా దేశమంతటా రాజకీయ సంస్కృతిలో మార్పు వచ్చిందని
నడ్డా వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు