దేశంలో
ఆదరణ పొందిన స్పోర్ట్స్ లీగుల్లో ప్రో కబడ్డీ కూడా ఒకటి. ఐపీఎల్ తర్వాతి స్థానం
దీనిదే. ఈ ఏడాదిలో జరిగే 10 వ సీజన్ ను దేశవ్యాప్తంగా ఐపీఎల్ తరహాలో నిర్వహించబతున్నారు.
అత్యంత వైభవంగా టోర్నీలో పాల్గొనే 12 జట్లకు చెందిన నగరాల్లో
కబడ్డీ సందడి ఓ రేంజ్ లో ఉండబోతుంది. ఈ విషయాన్ని లీగ్ ఆర్గనైజర్లు ప్రకటించారు.
డిసెంబర్
2 నుంచి జరిగే పదో సీజన్ కోసం సెప్టెంబర్ 8,9 తేదీల్లో ఆటగాళ్ల వేలం
నిర్వహించనున్నట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి వెల్లడించారు. ఇప్పటి వరకు
జరిగిన తొమ్మిది సీజన్లలో పాట్నా పైరేట్స్ మూడుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు