కర్ణాటక ప్రభుత్వ తీరును పలు హిందూ సంఘాలు
తప్పుబడుతున్నాయి. పాలక కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులు నిలిపివేస్తూ ముఖ్యమంత్రి
సిద్ధరామయ్య ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహిరంగ నిరసనలు
తెలుపుతున్నారు.
కర్ణాటక వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి విడుదల
చేసే నిధులు నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ మతసంస్థలు,
ధర్మాదాయ శాఖ కమిషనర్, అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు సాధారణ కార్యక్రమం కింద
ఆమోదించిన నిధులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని ప్రభుత్వం
పేర్కొంది. పాలక పార్టీ నిర్ణయాలపై బీజేపీ
నేతలు మండిపడుతున్నారు. పాలక కాంగ్రెస్
పార్టీ హిందూవ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు.