పాకిస్తాన్‌లో ఇటీవల ఏర్పాటైన ఆపద్ధర్మ
ప్రభుత్వ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్యకు చోటు కల్పించారు. కశ్మీర్ వేర్పాటువాది
యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ కు జూనియర్ మినిస్టర్ హోదా
కట్టబెట్టారు. పాక్ లో మానవహక్కులు, మహిళా సాధికారత అంశాల్లో తాత్కాలిక ప్రధానికి
ఆమె సలహాలు, సూచనలు అందజేస్తారు.
టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ దిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
కోర్టు జీవిత ఖైదు విధించగా మరణశిక్ష విధించాలని NIA వాదిస్తోంది. ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు కూడా
హాజరయ్యారు. 2009లో ముషాల్ హుస్సేన్ ముల్లిక్ ను యాసిన్ మాలిక్ వివాహం
చేసుకున్నారు.
పాకిస్తాన్‌లో ప్రస్తుతం అన్వర్ ఉల్ హక్ కాకర్ నేతృత్వంలో ఆపద్ధర్మ
ప్రభుత్వం కొనసాగుతోంది. హఖ్ సారథ్యంలో 19 మందితో మంత్రివర్గం ఏర్పాటైంది. వీరి
చేత అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. ఇందులో 16 మంది మంత్రులు, ముగ్గురు సలహాదారులు ఉన్నారు. నియోజకవర్గాల
పునర్విభజన కొనసాగుతున్నందున ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. మైనార్టీలపై దాడులు నిరోధించేందుకు 70 మందితో
ప్రత్యేక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇస్లామాబాద్ లో మైనార్టీలు, వారి
ఆస్తులు, ప్రార్థనామందిరాల రక్షణ కు ఈ విభాగం పనిచేయనుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు