టీమిండియా మరో టీ20 సీరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచీ
ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల పోరాటం మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లు మూడూ డబ్లిన్‌లోని మాలాహైడ్ స్టేడియంలో జరుగుతాయి. భారత కాలమానం
ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఐర్లాండ్‌తో ఇండియా ఇప్పటివరకూ ఐదు టీ20 మ్యాచ్‌లు
ఆడి అన్నీ గెలిచింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో సీరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో
భారత్ జాగ్రత్తగా ఆడవలసిన అవసరముంది. ఈ సీరీస్‌లో, విండీస్‌తో ఆడిన టీమ్ దాదాపు
పూర్తిగా మారిపోతుంది.
గాయం కారణంగా సుమారు
ఏడాది నుంచీ ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఈ సీరీస్‌తో మళ్ళీ ఫీల్డ్‌లోకి
దిగనున్నాడు. అలాగే, కొద్దికాలంగా సరిగ్గా రాణించలేకపోతున్న సంజూ శాంసన్ తన ఫాం
నిరూపించుకోవలసిన తరుణమిది. ఆసియా కప్, వరల్డ్ కప్ ఆశావహులకు తమ ప్రతిభను చాటుకునే
అవకాశం ఈ సీరీసే.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు