బీజేపీ దూకుడు వ్యూహం అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టు ఇవాళ విడుదల చేసింది. 90 మంది సభ్యులున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి 21 మందిని, 220 సీట్లున్న మధ్యప్రదేశ్లో 39 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించకముందే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించడం ఇదే మొదటిసారి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీతో ప్రధాని మోదీ సమావేశమైన మరుసటి రోజే అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
అభ్యర్థులను ముందే ప్రకటించడం ద్వారా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇటీవల కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తోపాటు తెలంగాణ, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. మణిపూర్లో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందంటూ సర్వే రిపోర్టులు వస్తున్నాయి. దీంతో బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళుతోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు