అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్లపై చూపింది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారిపోవడంతో దేశీయ మార్కెట్లులో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, ముగిసే సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 409 పాయింట్ల నష్టంతో 65129 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 19365 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, టైటాన్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, ఎస్బిఐ, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆసియన్ పెయింట్స్, హెచ్యూఎల్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్ , ఐసిఐసిఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు నష్టాలను చవిచూశాయి.
ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్భణం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు భారీగా తగ్గాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అటు ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు