ప్రపంచ ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త,
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) మాజీ డైరెక్టర్
డాక్టర్ వి.ఎస్ అరుణాచలం మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్
షా సంతాపం వ్యక్తం చేసారు.
‘‘అరుణాచలం మృతి శాస్త్ర సాంకేతిక
ప్రపంచానికి తీరని లోటు. అపారమైన ఆయన మేధస్సు, పరిశోధనల పట్ల అమితమైన అభిమానం,
దేశపు రక్షణ అవసరాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలు’’ అని ప్రధాని
మోదీ అన్నారు. ‘‘ఆయన చేపట్టిన ఎన్నో పరిశోధనలు భారత రక్షణ శాఖను సుదృఢం చేసాయి. ఆయన కుటుంబానికి, సహచరులు,
అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని అమిత్ షా ట్వీట్ చేసారు.
87 ఏళ్ళ డాక్టర్ అరుణాచలం అమెరికాలో
తుదిశ్వాస విడిచారు. ఆ మేరకు
ఆ ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. కాలిఫోర్నియాలో సన్నిహిత కుటుంబసభ్యుల
నడుమ డాక్టర్ విఎస్ అరుణాచలం నిద్రలోనే చనిపోయారని ఆ ప్రకటనలో వెల్లడించారు.
అరుణాచలం శాస్త్రవేత్తగా
ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్, నేషనల్
ఏరోనాటికల్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ వంటి సంస్థలకు
సేవలందించారు. డీఆర్డీఓ అధినేతగా పనిచేసారు. 1982 —`92 మధ్య కాలంలో నాటి రక్షణ మంత్రికి శాస్త్ర
సలహాదారుగా పనిచేసారు. భారత రక్షణ రంగాన్ని అణుశక్తితో బలోపేతం చేసిన ఘనత ఆయనది.
అరుణాచలాన్ని భారతదేశం శాంతిస్వరూప్ భట్నాగర్
పురస్కారం (1980), పద్మభూషణ్ (1985) పద్మవిభూషణ్ (1990) వంటి పురస్కారాలతో సత్కరించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు