భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్- 3 మరో కీలకఘట్టం పూర్తి చేసుకుంది. వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్లో ల్యాండర్ కీలకంగా వ్యవహరించనుంది. నేటి నుంచి ఈ ల్యాండర్ జాబిల్లిపై దిగేవరకు, చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తుంది.
జులై 14న ఎల్‌వీఎం3, ఎం4 రాకెట్ ద్వారా ఇస్రో శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్- 3 వ్యోమనౌకను ప్రయోగించింది. అప్పటి నుంచి కక్ష్యను పెంచుకుంటూ వెళ్లారు. 18 రోజుల్లో ఐదు సార్లు వ్యోమనౌక కక్ష్యను పెంచి చంద్రుడికి మరింత దగ్గర చేశారు. ఆగష్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి శాటిలైట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చంద్రుడికి అతి చేరువలోకి తీసుకెళ్లారు. కేవలం 100 కి.మీ దూరంలో ల్యాండర్ చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. ఈ నెల 23 సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు