అర్థరాత్రి నడిసముద్రంలో భారత నేవీ దళాలు సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టాయి. నడి సముద్రంలో ఓ నౌకలో ప్రయాణిస్తూ చైనీయుడు తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి, అతన్ని విజయవంతంగా ఎయిర్ లిఫ్ట్ చేసి 200 కి.మీ దూరంలోని ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటన అరేబియా సముద్రంలో చోటు చేసుకుంది.
పనామా జెండాతో ఉన్న ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నెంబరు 2 పరిశోధనా నౌక, చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఏఈ ప్రయాణిస్తోంది. బుధవారం అర్థరాత్రి
నౌకా సిబ్బందిలో ఒకరైన యిన్ వీంగ్‌యాంగ్ కార్డియాక్ అరెస్టుకు గురయ్యాడు. గుండెనొప్పితో విలవిల్లాడిపోయారు. ఇది గమనించిన నౌకలోని సిబ్బంది ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ కేంద్రానికి సమాచారం అందించారు. వారు సమీపంలోని కోస్ట్ గార్డ్ సిబ్బందిని అలర్ట్ చేశారు.
వెంటనే భారత్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. ఏఎల్‌హెచ్ ఎంకే-3 హెలికాఫ్టర్‌తో చైనీయుల నౌక వద్దకు చేరుకున్నారు. అర్థరాత్రి సమయంలో ఆ నౌక తీరానికి 200 కి.మీ దూరంలో ఉంది. ప్రతికూల వాతావరణంలోనూ కోస్ట్ గార్డ్ చిమ్మచీకట్లో ఆపరేషన్ విజయవంతం చేసింది. నౌకలోని వీగ్ యాంగ్‌ను హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. హెలికాఫ్టర్‌లోనే ప్రథమ చికిత్స అందించి అతని ప్రాణాలు కాపాడినట్టు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు