హైదరాబాద్ నగరంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కొద్ది వారాల కిందటే పెళ్లి చేసుకున్న యువతి, భర్తకు ప్రియురాలితో దగ్గరుండి వివాహం జరిపించింది. బంజారాహిల్స్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. బంజారాహిల్స్ సింగాడికుంటకు చెందిన రోజా అనే యువతి ట్యూటర్‌గా పనిచేస్తూ, యూసుఫ్‌గూడలో డాన్స్ అకాడమీలో చేరింది. అక్కడే గాంధీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరూ దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో సహజీవనం మొదలు పెట్టారు. ఇటీవల వారు వివాహం కూడా చేసుకున్నారు. ఇక్కడే మొదలైంది అసలైన ట్విస్ట్.
గాంధీ, మరో యువతితో సహజీవనం మొదలు పెట్టాడు. ఇంటికి లేటుగా రావడం మొదలుపెట్టాడు. భార్యకు అనుమానం వచ్చింది. నిలదీయడంతో మరో యువతితో సంబంధాలున్నట్లు తేలింది. దీంతో భార్య రోజా, భర్తకు దగ్గరుండి ప్రియురాలితో వివాహం జరిపించింది. అయితే గాంధీకి అప్పటికే పెళ్లైన విషయం ప్రియురాలికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తరవాత గాంధీకి అప్పటికే పెళ్లైన విషయం రెండో భార్యకు తెలియడంతో ఇరుకుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. రెండో పెళ్లి చేసుకున్న ప్రియురాలు గాంధీపై కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకిదిగారు. గాంధీ, రోజాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు