భారత్లో
ఐఫోన్ -15ను భారీఎత్తున తయారు చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సిద్ధమైనట్లు
తెలుస్తోంది. ఐఫోన్ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు యాపిల్ ఉత్పత్తుల తయారీ,
సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలమైన భారత్కు మధ్య అంతరాన్ని
తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు
పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్లాంట్లో గతంలో కంటే ఎక్కవగానే
ఈ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్ లు
ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల
తర్వాత
ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
చైనాలో
సప్లై చైన్ సమస్యలు, అమెరికా-చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సంబంధాలు, అదే
సమయంలో తయారీ కేంద్రంగా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలు
ఏర్పరుచుకున్నారు. భారత్ ను తయారీ కేంద్రంగా మలుచుకోవాలని టెక్ దిగ్గజాలను కోరారు.
చైనాలో
సప్లై చైన్ సమస్యలతో యాపిల్ తన తయారీని భారత్కు తరలించాలని నిర్ణయించింది.
కాబట్టే గత ఏడాదిలో భారత్లో తయారైన యాపిల్ ఐఫోన్ షిప్మెంట్ విలువ 65 శాతం
పెరిగింది. ఐఫోన్ల ఎగుమతుల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ చైనా మార్నింగ్
పోస్ట్ తెలిపింది. ఈ నివేదికను కోడ్ చేస్తూ ప్రముఖ మార్కెట్ సంస్థ కౌంటర్ పాయింట్
మరో రిపోర్టును వెలుగులోకి తెచ్చింది.
2022లో
భారత్ లో మొత్తం స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్ విలువలో యాపిల్ కు 25 శాతం వాటాను కలిగి
ఉందని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా
85 శాతం ఐఫోన్లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు నివేదికలో
టెక్నాలజీ రిపోర్టర్ జిన్నీ షెన్ తెలిపారు. అయినప్పటికీ యాపిల్ తన తయారీని చైనా
నుంచి భారత్ కు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్ తన ఆధిపత్యాన్ని కోల్పోయే
ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు