స్వతంత్ర
దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించినవిశ్వకర్మ పథకానికి కేంద్రమంత్రివర్గం
ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారికి రాయితీపై
రుణాలు అందజేస్తారు. లబ్ధిదారుడికి రూ. 2లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. గరిష్ఠంగా
5శాతం వడ్డీతోలబ్ధి పొందవచ్చు. ఈ పథకం ద్వారా
దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం కేంద్రం రూ.13 వేల
కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్
తెలిపారు.
చేతివృత్తుల
వారికి రోజుకు 500 రూపాయల ఉపకారవేతనంతో శిక్షణ ఇవ్వడంతో పాటు పరికరాల కొనుగోలుకు
రూ.15 వేల నగదు సాయం అందజేస్తారు. ఆ తర్వాత రాయితీతో లక్ష రుణం అందజేస్తారు.
దీనిని సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కూడా అందజేస్తారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా
సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.
పీఎం-ఈబస్ సేవ పథకానికి కూడా కేంద్రమంత్రి
వర్గం ఆమోదం తెలిపింది. రూ.57 వేల 613 కోట్ల ఖర్చుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు.169
పట్టణాల్లో 10 వేల ఈ-బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో 20 వేల కోట్లు కేంద్రం సమకూరుస్తుంది.
ఐటీ ఉద్యోగుల నైపుణ్యాలు మెరుగు పరిచేందుకు
డిజిటల్ ఇండియా పథకానికి నరేంద్రమోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
దేశంలో రైల్వే
లైన్ విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించుకోవడం కోసం ఏడు
మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రమంత్రివర్గం పచ్చజెండా ఊపింది. తెలుగు
రాష్ట్రాలతో పాటు యూపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, పశ్చిమబెంగాల్,
ఝార్ఖండ్ రాష్ట్రాలలోని 35 జిల్లాల పరిధిలో రైల్వే నెట్ వర్క్ ను 32,500 కోట్లకు
విస్తరించనున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు