తీవ్ర నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఒక సమయంలో 400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్… ట్రేడింగ్ ముగిసే సమయానికి 137 పాయింట్ల లాభంతో 65539 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 19465 వద్ద ముగిసింది. ఆటో, ఐటీ, ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్లకు మద్దతు లభించింది. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఎస్బీఎఫ్సీ షేర్లు ఇవాళ లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.57 కాగా…44 శాతం ప్రీమియంతో రూ.81.99 వద్ద ట్రేడింగ్ మొదలైంది. మార్కెట్ ముగిసే సమయానికి ఈ ఫైనాన్స్ కంపెనీ షేర్లు రూ.92 వద్ద ముగిశాయి. దీంతో పెట్టుబడిదారులు 61 శాతంపైగా లాభాలను మూటగట్టుకున్నారు. ఎస్బీఎఫ్సి రూ.1025 కోట్లు సమీకరించుకునేందుకు మార్కెట్కు రాగా 75 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ లభించింది. ఇటీవల కాలంలో ఒక కంపెనీలో ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు