ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014కు ముందు నుంచి పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై కూడా సీఎం సంతకం చేశారు. కనీసం ఐదేళ్లు పనిచేసి ఉండాలన్న నిబంధన కూడా తొలగించారు. గత కొంత కాలంగా తమను రెగ్యులర్ చేయాలంటూ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంత మందికి మేలు జరుగుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో అనేక శాఖల్లో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ తరచూ ఆందోళనకు దిగుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు