మథురలోని
శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలపై సుప్రీంకోర్టు
స్టే విధించింది. పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం,
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
వందే
భారత్ లాంటి అధునాత రైల్వే సర్వీసుల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్ వరకు 21
కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీంతో ఆగస్టు
9న కృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు.
దాదాపు 135 నివాసాలు తొలగించారు.
కుట్రపూరితంగా
ఇళ్లు తొలగిస్తున్నారంటూ పలువురు స్థానిక కోర్టును ఆశ్రయించారు. యూపీ లో
న్యాయవాదుల ఆందోళన కారణంగా విచారణ ఆలస్యమైంది. దీంతో పిటిషన్ దారులు
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం
పదిరోజుల పాటు కూల్చివేతలు చేపట్టవద్దంటూ ఆదేశాలిచ్చింది.
కృష్ణ
జన్మభూమి-షాహి ఈద్గా మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ శ్రీకృష్ణ
జన్మభూమి ముక్తి ట్రస్ట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు
త్వరలో విచారించనుంది.