ఆసియా కప్ టోర్నమెంట్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. నేపాల్ జట్టు తొలిసారి ఆడనుంది. పాకిస్తాన్, నేపాల్ మధ్య మొదటి మ్యాచ్ ముల్తాన్లో జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాక్ మధ్య పోరు ఉంటుంది.
టోర్నీలో పాల్గొనే ఆరు దేశాల జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో టీమిండియా, పాకిస్తాన్, నేపాల్ ఉండగా, గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఆడతాయి.
ఆసియా కప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్లు ఓడిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 45 మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు 26 సార్లు గెలవగా 16 మార్లు పరాజయం చెందింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ 45 మ్యాచ్లలో టీమిండియాతో 13 సార్లు తలపడగా 8 సార్లు ఓడింది.
భారత జట్టు 50 ఓవర్ల ఫార్మాట్లో 49 మ్యాచ్లు ఆడి 31 సార్లు విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది.
శ్రీలంక టీమ్ ప్రదర్శన కూడా మెరుగ్గానే ఉంది. ఇప్పటి వరకు ఐదు సార్లు టైటిల్ గెలిచిన ఈ జట్టు.. 50 మ్యాచ్లు ఆడి 34 సార్లు నెగ్గింది. 2018 నుంచి ఈ టోర్నీలో పాల్గొంటున్న ఆప్ఘనిస్తాన్ జట్టు 9 మ్యాచ్ లు ఆడి మూడుసార్లు మాత్రమే గెలిచింది. 1986 నుంచి ఆసియా కప్ ఆడుతున్న బంగ్లాదేశ్ జట్టు 36 సార్లు ఓడి, కేవలం 7 సార్లు మాత్రమే గెలిచింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు