మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి కొనియాడారు. వాజ్పేయీ 5వ వర్ధంతి సందర్భంగా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురందరేశ్వరి ఘన నివాళులర్పించారు. అటల్ జీవితం బీజేపీలో ప్రతి కార్యకర్తకు దిక్సూచి అని ఆమె అన్నారు. పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తాను ప్రపంచ దేశాలకు చాటారని పురందరేశ్వరి గుర్తు చేసారు.
బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వాజ్పేయీ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని పురందరేశ్వరి గుర్తుచేసుకున్నారు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలను ప్రారంభించిన వాజ్పేయీ జీవితం యువతకు ఆదర్శమన్నారు. దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత వాజ్పేయీకే దక్కుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సుపరిపాలన పేరు చెబితే అటల్జీ పేరు గుర్తుకు వస్తుందన్నారు.
వాజ్పేయీ చూపిన సేవా మార్గంలో అందరూ నడవాలని పురందరేశ్వరి పిలుపునిచ్చారు. పలువురు బీజేపీ నాయకులు, ప్రముఖులు వాజ్పేయీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు