హిందూ
విశ్వాసమే తన జీవితంలో మార్గదర్శిగా ఉందని బ్రిటన్ ప్రధానిగా పనిచేసేందుకూ ఆ
నమ్మకమే ధైర్యాన్ని ఇస్తోందని ఆ దేశ ప్రధాని రుషి శునక్ అన్నారు.
భారత
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంబ్రిడ్జి వర్సిటీలోని జీసస్ కాలేజీలో ఆధ్యాత్మికవేత్త
మొరారి బాపు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామకథ కార్యక్రమంలో పాల్గొన్న రుషి శునక్,
తాను ఇక్కడకు ప్రధానిగా రాలేదని, కేవలం, హిందువుగా హాజరైనట్లు తెలిపారు. తన దృష్టిలో
విశ్వాసం వ్యక్తిగతమైనదని, అదే తనను జీవితంలో ముందుకు తీసుకెళ్తుందని వివరించారు.
బ్రిటన్
ప్రధాని పదవి గొప్ప గౌరవం అయినప్పటికీ అంత సులభం కాదన్న రుషి శునక్..అత్యంత
క్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమయంలో మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని బలాన్ని
ఇస్తుందన్నారు. తన కార్యాలయంలోనూ బంగారు వినాయకుడి విగ్రహం ఉందన్న రుషి, ఏదైనా పని
చేసే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం, ప్రభావాలను అంచనా వేయడం గణేశుడి
నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు.
రుషి
శునక్ కు హృదయపూర్వక స్వాగతం పలికిన బాపు మొరారీ.. హనుమంతుడి ఆశీర్వాదాలు ఆయనకు
ఎల్లవేళలా ఉండాలని దీవించారు. ఆయన పాలనలో బ్రిటీషు ప్రజలకు మరింత మేలు జరగాలని
ఆకాంక్షించారు.
తాను
పుట్టి పెరిగిన సౌదాంప్టన్ లోని హిందూ దేవాలయంతో తనకు ఎన్నో బాల్యజ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. రుషి
శునక్ పూర్వీకులు పంజాబ్ నుంచి వలస వెళ్లి ఇంగ్లాండ్ లో సిర్థపడ్డారు. అయినప్పటికీ
హిందూ ఆచారాలనే పాటిస్తున్నారు.