భారతరత్న, దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ
వాజ్పేయీ ఐదవ వర్ధంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తోంది.
ఢిల్లీలోని ఆయన సమాధిస్థలం ‘సదైవ్ అటల్’ స్మారకం వద్ద పలువురు ప్రముఖులు అంజలి
ఘటించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం సదైవ్ అటల్
స్మారకం వద్ద నివాళులర్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్
ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర
హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు వాజ్పేయీకి ఘన
నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ మొదటిసారి తన
మిత్రపక్షాలను లేదా ఎన్డీయే భాస్వామ్య పార్టీలనూ ఆహ్వానించడం విశేషం. బిహార్ మాజీ
ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, అన్నాడీఎంకే
నాయకుడు తంబిదురై, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్, ఎన్సీపీ నాయకులు ప్రఫుల్ పటేల్, అగాధా సంగ్మా
తదితరులు మాజీ ప్రధాని సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారందరితో పాటు వాజ్పేయీ దత్త కుమార్తె నమితా భట్టాచార్య
కూడా తన తండ్రికి నివాళులర్పించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు