ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరును అధికారికంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని పేరు ఇక నుంచి ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా వ్యవహరించనున్నారు. మ్యూజియం పేరు మార్చినట్టు పీఎంఎంఎల్ ఉపాధ్యక్షుడు ఎ.సూర్య ప్రకాష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆగష్టు 14, 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ఆయన తెలిపారు. నెహ్రూ మ్యూజియం పేరు మార్చాలంటూ ఎన్ఎంఎంఎల్ సొసైటీ జూన్‌లో తీర్మానం చేసి కేంద్ర సాంస్కృతిక శాఖకు పంపింది. ఈ సొసైటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ మ్యూజియాన్ని పునరుద్ధరించి, గత ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రజలను సందర్శనకు అనుమతిస్తున్నారు. మ్యూజియాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. వీడియోల ద్వారా జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను తెలుసుకోవచ్చని సాంస్కృతిక శాఖ
ఓ ప్రకటనలో తెలిపింది. మన ప్రధానులు అనేక విపత్కర పరిస్థితులను ఎలా అధిగమించారనే విషయాలను సందర్శకులు ఇక్కడి వీడియోల ద్వారా తెలుసుకునే సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు