ఓ కిలాడి మాటలకు ఓ పెద్దాయన నిలువునా మోసపోయాడు. కొడుకు క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడంటూ కథలు చెప్పి, పెద్దాయన సాయం పొందింది. పిల్లాడి చికిత్స కోసం పెద్దాయన చిన్న మొత్తంలో సాయం చేయడం ప్రారంభించాడు. గతంలో ఉన్న చిన్నపాటి పరిచయంతో వారిద్దరూ బెంగళూరులోని ఉత్తరహళ్లిలో అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకునే వారు. ఇలా వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. అరవై ఏళ్ల పెద్దాయన అనేక సార్లు ఆ మహిళకు ఆర్థిక సాయం అందించారు. కష్టాలు తొలగిపోతాయని ఆమెకు ధైర్యం చెప్పాడు.
కొన్ని రోజుల తరవాత బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ హోటల్లో రూం బుక్ చేసుకుని ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. ఇలా రెండు మూడు సార్లు కలుసుకున్నారు. ఇదే సమయంలో పెద్దాయనకు తెలియకుండా కిలేడి చెల్లెలు రంగంలోకి దిగి వీడియోలు, ఫోటోలు తీసింది. ఆ తరవాత నుంచి పెద్దాయనకు టార్చర్ మొదలైంది. రహస్యంగా రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలు పెద్దాయనకు పంపించి బెదిరించి డబ్బులు గుంజడం మొదలు పెట్టారు. అలా రూ.82 లక్షలు కాజేశారు. అంతటితో ఆగకుండా మరో రూ.40 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన పెద్దాయన పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. విషయం పోలీసులకు చేరడంతో ఆ ఇద్దరి కిలేడీల కోసం వేట మొదలు పెట్టారు. హనీట్రాప్ గాలం వేసి పెద్దాయన్ని కిలేడీ కొల్లగొట్టిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు