చంద్రయాన్-3
లక్ష్యానికి అత్యంత సమీపానికి చేరింది. మరో 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే తుది
గమ్యాన్ని చేరుకుని అరుదైన ఘనత సొంత చేసుకోబోతుంది. ఇప్పటికే తన ప్రయాణంలో అత్యంత
కీలకమైన మైలురాళ్లునూ విజయవంతంగా దాటేసింది వ్యోమనౌక, ల్యాండింగ్ ప్రక్రియకు సిద్ధమవుతోంది.
రోదసికిలోకి
వెళ్లిన చంద్రయాన్-3 విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి చుట్టూ వ్యోమనౌక కక్ష్య
తగ్గింపు విన్యాసాన్నిఇస్రో విజయవంతంగా నిర్వహించింది. దీంతో కక్ష్య తగ్గింపు
ప్రక్రియలు పూర్తి అయ్యాయి. జాబిల్లి చుట్టూ ప్రయాణించేందుకు ఇదే చివరి కక్ష్య.
ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున
ఉన్న కక్ష్యలోకి చేరింది.
ఆగస్టు
17న వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ విడిపోయేలా చేస్తారు. ఈ
ప్రక్రియ సజావుగా జరిగితే మాడ్యూల్ చంద్రుడిపై పరిశోధన చేస్తోంది. ఆగస్టు 23న
సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3ని జులై 14న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా
విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. మరుసటిరోజు తొలిసారిగా కక్ష్యను పెంచి 18
రోజుల వ్యవధిలో విడతల వారీగా ఐదుమార్లు కక్ష్యను పెంచారు. భూకక్ష్య పూర్తియిన
తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణానికి గానూ ఆగస్టు1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి
ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలో చేర్చారు.
తర్వాత క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు.