దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లుపైగా కోల్పోయింది. నిఫ్టీ కూడా 80 పాయింట్లు నష్టపోయింది. తరవాత కొద్దిగా కోలుకున్న సెన్సెక్స్ 222 పాయింట్ల నష్టంతో 65179 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడంతో వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా చూపింది.
ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం, ఐటీసీ, టెక్ మహింద్రా, ఎల్ అండ్ టీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి.
దేశంలో ద్రవ్యోల్భణం ఎన్నడూ లేని విధంగా 15 నెలల గరిష్ఠానికి అంటే 7.44 శాతానికి చేరింది. కూరగాయల ధరలు, పప్పుల ధరలు విపరీతంగా పెరగడంతో ద్రవ్యోల్భణం ఎగబాకింది. ద్రవ్యోల్భణం రిజర్వు బ్యాంకు నిర్దేశించిన 2 నుంచి 6 శాతం దాటిపోయి ఆందోళన కలిగిస్తోంది. జులై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ద్రవ్యోల్భణం సగటున 6.2 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ప్రస్తుతం ద్రవ్యోల్భణం ఆర్బీఐ అంచనాలను దాటిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత కొనసాగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు