వివాదాస్పద సాయుధ
బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఈ ఏడాది చివరి నాటికి రద్దు చేస్తామని అస్సాం సీఎం
హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గువాహటి
లో ప్రసంగించిన హిమంత బిశ్వశర్మ.. AFSPA ను
పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని మిగతా జిల్లాలకు
విస్తరించాలని కేంద్రాన్ని62 సార్లు అభ్యర్థించాయన్న సీఎం హిమంత్, తమ ప్రభుత్వం
ఏర్పాటైన తర్వాత క్రమంగా మార్పు వస్తోందన్నారు.
తాను ముఖ్యమంత్రిగా
బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకశక్తులతో నాలుగు సార్లు శాంతిచర్చలు
జరిపి ఒప్పందాలు చేసుకున్నానని గుర్తు చేశారు.
దాదాపు 8 వేల మంది మిలిటెంట్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు
తెలిపారు.
అస్సాంను అవినీతి
రహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అస్సాంలో
ఎనిమిది జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం -1958 పరిధిలో ఉన్నాయి. ఈ
చట్టం మేరకు కల్లోలిత ప్రాంతాల్లో ఎలాంటి వారెంట్లు లేకుండా సోదాలు జరపడం,
అనుమానితులను అదుపులోకి తీసుకోవచ్చు. అవసరమైతే కాల్పులు జరిపే అధికారం కూడా ఉంది.
అయితే ఈ చట్టం దుర్వినియోగం అవుతుందంటూ పలువురు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
చట్టాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యుల పై దారుణాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలూ
ఉన్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు