భారత్‌లో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లు విక్రయించే తేదీలను ఐసీసీ ప్రకటించింది. వార్మప్మ్యాచ్ల నుంచి, వరల్డ్ కప్ ఫైనల్ వరకు అన్ని టికెట్లనూ ద్వారా విక్రయించనున్నట్లు పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. http://cricketworldcup.com/register లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు అని వివరించింది.
ఆగస్టు 25 నుంచి టికెట్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 25న భారత జట్టు మినహా ఇతర అన్ని జట్లూ ఆడే వార్మప్ మ్యాచ్‌ల టికెట్లు, వరల్డ్ కప్ టికెట్లు అమ్ముతారు.
ఆగస్టు 30న గువాహటి, త్రివేండ్రం, స్టేడియాల్లో జరిగే భారత్ వన్డే మ్యాచ్ టికెట్లు విక్రయిస్తారు.
ఆగస్టు 31న చెన్నై, దిల్లీ, పుణేలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ అమ్మకాలు జరుగుతాయి.
సెప్టెంబర్ 1న ముంబై, లక్నో, ధర్మశాలలో భారత్ ఆడే మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
సెప్టెంబర్ 2న బెంగళూరు, కోల్‌కతాలో టీమిండియా ఆటకు సంబంధించిన టికెట్ల అమ్మకం ఉంటుంది.
సెప్టెంబర్ 3న, అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్ టికెట్ల విక్రయం ఉంటుంది.
సెప్టెంబర్ 15న ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జరుగుతాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు