రష్యాలోని మఖచ్కలా ప్రాంతంలో ఒక ఫిల్లింగ్ స్టేషన్
దగ్గర ఈ ఉదయం పేలుడు చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో మృతుల సంఖ్య 35కు పెరిగింది.
‘‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6గంటలకు ఈ
విషాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 35 మంది చనిపోయారు. 102మంది గాయపడ్డారు’’
అని డగస్తాన్ ప్రాంత అధినేత సెర్గేయ్ మెకిలోవ్ వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు
చిన్నారులు కూడా ఉన్నారు.
ఫిల్లింగ్ స్టేషన్ ఎదురుగా పేలుడు జరగ్గానే
మంటలు చెలరేగాయి. చుట్టూ 600 చదరపు మీటర్ల దూరం వ్యాపించాయి. ఆ మంటలను వెంటనే
అగ్నిమాపక దళాలు ఆర్పేసాయి. ప్రమాదానికి కారణాలను, అసలు ప్రమాదం స్వభావాన్నీ తెలుసుకోడానికి
అధికారులు రంగంలోకి దిగారు.
ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం… అక్కడ
ఎనిమిది ఇంధన ట్యాంకులు ఉన్నాయి. వాటిలో రెండు ట్యాంకుల్లో పేలుడు జరిగింది. 20
అగ్నిమాపక శకటాలతో, 70మందికి పైగా ఫైర్ ఫైటర్లు శ్రమించి మంటలు ఆర్పివేసారు. పోలీసులు,
అధికారులు కలిసి స్థానికులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్