బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఎట్టకేలకు
భారతీయ పౌరసత్వం లభించింది. ఆ విషయాన్ని ఆయన
ట్విటర్ ద్వారా
ప్రకటించారు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ భారతీయమే. స్వాతంత్ర్య
దినోత్సవ శుభాకాంక్షలు’ అనిట్వీట్ చేసారు. నిన్నమొన్నటి వరకూ అక్షయ్‌కి కెనడా పౌరసత్వం
ఉన్న సంగతి తెలిసిందే.
2019 పార్లమెంటు ఎన్నికలకు
ముందు పౌరసత్వం విషయంలో అక్షయ్‌పై విమర్శలు చెలరేగాయి. ఆ సమయంలో భారతీయులందరూ
ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్షయ్
పిలుపునిచ్చారు. భారతీయ
పౌరుడే కాని వ్యక్తిదేశపౌరులకు సందేశం ఇస్తాడా అంటూ అప్పట్లో
పలువురు అక్షయ్‌ని విమర్శించారు. ఆ విషయంపై ఆయన
అప్పట్లోనే వివరణ ఇచ్చారు. భారత్ పౌరసత్వాన్ని తిరిగి పొందాలి అనుకుంటున్నానని,
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాననీ చెప్పారు.
అసలు అక్షయ్ భారత
పౌరసత్వం వదిలి, కెనడా పౌరసత్వం తీసుకున్నది దేనికి? ఆ విషయాన్ని ఆయన గతంలో ఓసారి చెప్పారు. ‘‘90వ దశకంలో నా
పరిస్థితి దారుణంగా తయారైంది. వరుసగా 15 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కెనడాలో ఉన్న
స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్ళి పనిచేసుకోవాలనుకున్నాను. అందుకే కెనడా పాస్‌పోర్ట్‌కు అప్లయ్ చేశా. అది వచ్చే సమయానికి, ఓ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో
ఇండియాలోనే ఉండిపోయాను. అందుకే తర్వాత భారత పౌరసత్వం కోసం మళ్ళీదరఖాస్తు చేసుకున్నాను’’ అని వివరించారు.