ప్రేమగా పెంచి పెద్ద చేసిన తండ్రి మరణం తట్టుకోలేకపోయింది ఓ కుమార్తె. తండ్రి మృతదేహంపై పడి రోదిస్తూ కన్నీరుమున్నీరైంది. తండ్రి మరణం తట్టుకోలేక ఆమె కూడా ప్రాణాలొదిలిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం…తండ్రిని చివరి చూపు చూసుకునేందుకు అత్తింటి నుంచి తిరుమలగిరికి వచ్చిన
వజ్రమ్మ, తండ్రి వీరయ్యను మృతదేహాన్ని చూసి చలించిపోయింది. తండ్రి మృతదేహంపై పడి ఏడుస్తూనే ప్రాణాలొదిలిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది.
సూర్యాపేటకు చెందిన వీరయ్య ఆర్ అండ్ బీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అతని భార్య, పెద్ద కుమారుడు ఇప్పటికే మరణించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని
చిన్న కుమారుడు ప్రభుదాస్ వద్ద వీరయ్య ఉంటున్నారు. కుమార్తె వజ్రమ్మకు 40 సంవత్సరాల కిందటే భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన బుంగ యాదగిరితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి కూడా వివాహాలయ్యాయి.
వీరయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం కన్నుమూశాడు. తండ్రిని చివరి చూపు చూసేందుకు వజ్రమ్మ తిరుమలగిరికి వచ్చింది. రాగానే తండ్రి మృతదేహంపై పడి భోరున విలపించింది. గుండెలవిసేలా రోదించింది. చివరకు తండ్రి మృతదేహంపైనే ప్రాణాలు విడిచింది. తిరుమలగిరిలో సోమవారం వీరయ్య అంత్యక్రియలు నిర్వహించారు. వజ్రమ్మ మృతదేశాన్ని మోత్కూరు తీసుకెళ్లి ఇవాళ అంత్యక్రియలు చేశారు. తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమతో కుమార్తె వజ్రమ్మ ప్రాణాలొదలడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు