మావోయిస్టులు,పోలీసు
బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో జార్ఖండ్ జాగ్వార్ ఫోర్సు(JJF)కు
చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. JJF
ఆ రాష్ట్ర పోలీసు శాఖలో కీలక
విభాగం. జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్భం జిల్లాలోని టోంటో ప్రాంతంలో ఈ ఘటన
చోటుచేసుకుంది.
మావోయిస్టులు మెరుపుదాడికి దిగడంతో అమిత్ తివారీ,
గౌతమ్ కుమార్ అనే జవాన్లు మృతి చెందినట్లు సింగ్బం ఎస్పీ అశుతోష్ తెలిపారు. అదే
ప్రాంతంలో కొన్ని రోజుల కిందట మావోలు జరిపిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువుగా
ఉన్నాయనే సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు