స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ, ప్రజలకు వరాల జల్లు కురిపించారు. పట్టణ
ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా ఈ పథకాన్ని
ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంప్రదాయ
కళాకారులకు చేయూత అందించేందుకు మరో
పథకాన్ని అమలు చేస్తామని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రకటించారు. ఈ
పథకం తొలివిడత అమలు కోసం 13 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు
వివరించారు.
చౌకధరల్లో లభించే జనరిక్ మందులు అందరికీ
అందుబాటులో ఉండేందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు
పెంచుతున్నట్లు తెలిపిన ప్రధాని.. మార్కెట్లో 100 రూపాయల విలువైన మందులు, పది
నుంచి పదిహేను రూపాయలకు అందిస్తున్నామన్నారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా
ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించిన ప్రధాని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక
వ్యవస్థగా అవతరించబోతున్నట్లు తెలపారు.
అవినీతి, కుటుంబ, వారసత్వ రాజకీయాలకు స్వస్తి
పలకాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ, మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే స్వాతంత్ర్య
దినోత్సవానికి భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్తా అన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు