భారతదేశం మొత్తం ఇవాళ జాతీయజెండాల రెపరెపలతోనిండిపోయింది.
విదేశీ పాలన కబంధ హస్తాల నుంచి దేశం విముక్తమైన సందర్భాన్ని పురస్కరించుకుని,
ప్రతీ యేటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనని భారతీయుడే ఉండడు. రాజకీయాలకు
అతీతంగా అందరూ సమష్టిగా జరుపుకునే జాతీయ పండుగ మువ్వన్నెల పండుగ.
ఇలాంటి
రోజు కూడా కాంగ్రెస్ తన కురచబుద్ధినే ప్రదర్శించింది. దేశమన్నా, దేశ ప్రజలన్నా
తనకు ఎంతమాత్రం పట్టదని మరోసారి నిరూపించుకుంది. ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా రెపరెపలాడే
వేడుకను చూడడానికి దేశం మొత్తం ఎదురుచూస్తుంది. అలాంటి ఉత్సవానికి కాంగ్రెస్
పార్టీ దూరం జరిగింది. తమకు నచ్చని నాయకుడు వరుసగా పదోసారీ జాతీయ జెండా ఎగరేస్తుంటే
చూడలేక, సహించలేక… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకే డుమ్మా కొట్టింది.
కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనాటి ఎర్రకోట వద్ద వేడుకలకు హాజరు కాలేదు.
ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా ఉండిపోయింది. తనకు ఆరోగ్యం బాగోలేనందున ఈ
కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్టు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
చిత్రమేంటంటే,
మల్లికార్జున ఖర్గే దేశ రాజధానిలోనే ఉన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ
కార్యాలయంలో జెండా ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా
మొదటిసారి ఆయన స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో
ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఇది కూడా కాంగ్రెస్ చరిత్రలో
మొదటిసారే. స్వాతంత్ర్య వేడుకల్లో రాజకీయ విమర్శలు చేయకూడదన్న ఒక అలిఖిత
సంప్రదాయాన్ని ఆ పార్టీ చాలాకాలంగా పాటిస్తోంది. దాన్ని కూడా ఖర్గే వదిలిపెట్టారు.
ఇంతకీ,
దేశ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు ఖర్గే ఎందుకు హాజరు కాలేదు? తన కంటికి సమస్యగా
ఉన్నందున వెళ్ళలేకపోయానని ఆయన చెప్పారు. తన ఇంటి దగ్గర, పార్టీ కార్యాలయం దగ్గర
జెండాలు ఎగురవేయడానికి మాత్రం ఖర్గేకి కంటి సమస్య అడ్డంకి కాలేదు.
అంతటితో
అయిపోలేదు. ఖర్గే ఎర్రకోట వేడుకలకు హాజరు కాకపోవడానికి అద్భుతమైన కారణం చెప్పారు.
‘‘అక్కడ ప్రధానమంత్రికి విపరీతమైన భద్రత ఉంటుంది. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి,
లోక్సభ స్పీకర్ తదితరులు వెళ్ళేవరకూ మమ్మల్ని వెళ్ళనీయరు. అందువల్ల ఆ
కార్యక్రమానికి వెళ్ళడం అసాధ్యం’’ అని తేల్చేసారు.
దేశ
ప్రజలందరూ జరుపుకునే వేడుకలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అడ్డం
వచ్చిన కారణం, అక్కణ్ణుంచి త్వరగా బైటపడలేకపోవడం అనే సమస్యట. వినడానికి ఎంత
హాస్యాస్పదంగా ఉంది. వేడుకలు పూర్తయాక మహా అయితే ఒక్క అరగంటలో ఆ ప్రాంగణమంతా ఖాళీ
అయిపోతుంది. ఆ సమయం కూడా ఆగలేడట ప్రతిపక్ష నాయకుడు.
ఒకటి
మాత్రం నిజం. ఆయన కంటికి సమస్య ఉందన్న మాట నిజం. తమ పార్టీని చీల్చి చెండాడి,
ఉతికి ఆరేస్తున్న పార్టీ అధికారంలో ఉండి.. వరుసగా పదో యేడాది కూడా ఎర్రకోట మీద
నుంచి జెండా ఎగరేస్తుంటే… కళ్ళు మండడం సహజమే కదా. ఆ మంటతో వేడుకల్లో ఎలా
పాల్గొంటారు. అందుకే, తన ఇంట్లో, తన పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేయడానికి అడ్డం రాని
కంటి సమస్య… ప్రభుత్వ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చింది.
ఈ
సందర్భంగా తాజాగా జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. ఈ మధ్యే ముగిసిన పార్లమెంటు
వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ‘ఇండియా’
కూటమి ప్రతిపాదించిన ఆ తీర్మానాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ తమ మాజీ
ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ను రాజ్యసభకు తీసుకొచ్చింది. అనారోగ్యంతో,
శారీరక బలహీనతతో, నోట మాట రాని స్థితిలో, వీల్చెయిర్లో తప్ప లేచి నిలబడలేని
స్థితిలో ఉన్న మన్మోహన్ సింగ్ను ఈ ఖర్గే నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులోకి
తీసుకొచ్చింది. గెలిచే అవకాశం ఏమాత్రం లేదన్న స్పష్టత ఉన్న అవిశ్వాస తీర్మానానికి
ఆ పెద్దాయనను లాక్కుని మరీ తీసుకొచ్చింది. అదేంటని అడిగితే, ప్రజాస్వామ్య విలువల
పట్ల నిబద్ధతతో ఆ పెద్దాయనే స్వయంగా వచ్చారని కాంగీయులు బుకాయించారు.
ఖర్గే
పరిస్థితి అంత దారుణంగా ఏమీ లేదు కదా. మన్మోహన్ సింగ్ అంత బలహీనంగా ఐతే ఖర్గే
లేరు కదా. అలాంటప్పుడు రాజకీయాలకు అతీతంగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేవలం
రాజకీయ కారణాలతోనే హాజరు కాకపోవడం గర్హనీయం.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు