ప్రధానమంత్రి
నరేంద్రమోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని మణిపూర్ అంశం ప్రస్తావనతో ప్రారంభించారు.
ఎర్రకోట మీద జెండా ఎగరవేసిన ప్రధాని ఆ తరవాత ప్రసంగించారు.
‘‘గత
కొద్దివారాలుగా, మణిపూర్ హింసాకాండను చవిచూసింది. ఎంతోమంది ప్రజలు ప్రాణాలు
కోల్పోయారు. మన తల్లులు, అక్కచెల్లెళ్ళు అవమానాల పాలయ్యారు. క్రమంగా పరిస్థితి
మారుతోంది. మణిపూర్‌లో శాంతి నెలకొంటోంది. దేశం మణిపూర్‌కు అండగా నిలుస్తుంది’’
అని మోదీ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు.
‘‘గత
కొద్దిరోజులుగా శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. మణిపూర్ ప్రజలు ఆ శాంతియుత
వాతావరణాన్ని కొనసాగించాలి. శాంతి ద్వారా మాత్రమే సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది’’
అన్నారు మోదీ.
దేశం
సమగ్ర అభివృద్ధికి అందరూ పాటుపడాలన్నారు ప్రధాని. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించాలన్నారు.
‘‘మణిపూర్‌లో హింస జరిగితే, మహారాష్ట్రలో బాధ కలుగుతుంది. దేశ ఐక్యత అంటే అదే’’
అని వ్యాఖ్యానించారు.
వరుసగా
పదో సంవత్సరం స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం చేసిన నరేంద్ర మోదీ, 140 కోట్ల
భారతీయులను కుటుంబసభ్యులుగా సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ,
భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ తదితర స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను
స్మరించుకున్నారు.