మూడు
సార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ప్రఖ్యాత భారతీయ సంగీత విద్వాంసుడు రికీ కెజ్, భారత
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వందమంది సంగీతవేత్తల ఆర్కెస్ట్రాతో భారత జాతీయ
గీతాన్ని అనుసృజించారు. లండన్‌లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా జనగణమన
గీతాన్ని స్వరబద్ధంగా వాయించింది.
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న భారతీయులందరికీ కానుకగా ఈ గీతాన్ని అందిస్తున్నట్టు రికీ కెజ్ ప్రకటించారు. 60
సెకన్ల ఈ సంగీతఝరి రూపకల్పనలో వందమంది వాయిద్యకారులు పాల్గొన్నారు. ఈ స్వరప్రస్తారాన్ని
లండన్‌లోని అబే రోడ్ స్టూడియోస్‌లో రికార్డ్ చేసారు. భారత జాతీయ గీతాన్ని రికార్డ్
చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా బృందం ఇదేనని రికీ కెజ్ వెల్లడించారు.
దేశానికి
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు నిండిన సందర్భంగా భారతీయులకు ఈ కానుక అందిస్తున్నట్టు
రికీ కెజ్ చెప్పారు. వేలయేళ్ళ పరాధీనత నుంచి బైటపడిన భారతదేశం 75ఏళ్ళలోనే
ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే స్థాయికి ఎదుగుతుండడం గర్వకారణమని రికీ
అభిప్రాయపడ్డారు. నవీన భారతావనికి ఈ గీతం ప్రతీక అన్నారు.
రికీ
విడుదల చేసిన వీడియోపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అద్భుతమైన ఈ స్వర
ప్రస్తారం భారతీయులందరినీ గర్వపడేలా చేస్తుందని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు