భక్తుల
భద్రత కోసం ఎంత ఖర్చైనా చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
కాలినడకన తిరుమల చేరుకునే వారికి అడవిజంతువుల నుంచి రక్షణ కోసం ఊతకర్ర
అందిస్తామని, ఆపదలో అదే ఆయుధంగా ఉపయోగపడుతుందని వివరించారు.
తిరుమల
నడకదారిలో క్రూరమృగాల సంచారం, భక్తుల భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో
టీటీడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోవూరుకు చెందిన చిన్నారి
లక్షితను చిరుత చంపేసిన ఘటన నేపథ్యంలో పాలకమండలి అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు
తీసుకుంది.
నడకదారిలో
వెళ్లే భక్తులకు అపాయం లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భూమన
తెలిపారు.
అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల
వరకే పిల్లలకు అనుమతి ఉంటుంది. పెద్దవాళ్లు రాత్రి పదిగంటల వరకు నడకదారిలో
వెళ్లవచ్చు. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరుగంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలపై
ఆంక్షలు విధించారు. అలాగే భక్తులు గుంపుగా వెళ్లాలని సూచించారు.
‘‘నడకదారిలో
జంతువులకు భక్తులు ఎలాంటి ఆహారం అందించకూడదు. దుకాణదారులు ఆహారవ్యర్థాలను బయట
వేయకూడదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి’’ అని హెచ్చరించారు.
తిరుపతి నుంచి తిరుమల వరకు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు
చేయడంతో పాటు నడకదారిలో ఇరువైపులా లైటింగ్ పెంచుతారు. బేస్ క్యాంప్, మెడికల్
క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫెన్సింగ్ ప్రతిపాదనపై మరింత
అధ్యయనం తర్వాత అటవీశాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు