అంతరిక్ష
ప్రయోగాల్లో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో భారీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.
ఆదిత్యుడి పేరుతో సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమవుతోంది.
సౌరవ్యవస్థ,
అంతరిక్షంలో మార్పులను పరిశీలించేందుకు అతిపెద్ద ప్రాజెక్టును ప్రారంభించింది. PSLV-C57/ ఆదిత్య-ఎల్1 ప్రాజెక్టు సిద్ధమైనట్లు
ఇస్రో వెల్లడించింది. బెంగళూరులో తయారైన శాటిలైట్ శ్రీహరికోటకు చేరుకుంది.
దేశీయ తొలి సౌర ప్రయోగంగా ఇది రికార్డు
నెలకొల్పనుంది.
సౌర
వ్యవస్థ కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేస్తారు. ఆదిత్య-ఎల్1
బరువు సుమారు 1,500 కేజీలు ఉంటుంది. మొత్తం ఏడు పేలోడ్లు ఇందులో అమరుస్తారు.
సెప్టెంబర్ లో శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేయనున్నట్లు సమాచారం.
భూమి
నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్నకక్ష్యలో
దీనిని ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరవ్యవస్థను
నిరంతరం అధ్యయనం చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.