రైల్వే శాఖ ఆధ్వర్యంలో విభజన గాయాల
సంస్మరణ దినం నిర్వహించారు. దేశ విభజన సమయంలోని ప్రధాన
ఘట్టాలను గుర్తు చేసేలా గుంటూరు రైల్వేస్టేషన్లో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మత విద్వేషాలు,
పెద్దసంఖ్యలో కుటుంబాల వలస, ఆస్తినష్టం వంటి విషయాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుంటూరు రైల్వే
మేనేజర్ రామకృష్ణ… స్వాతంత్ర్య పోరాటం, దేశ విభజన సమయంలో జరిగిన ముఖ్య ఘట్టాలను,
నేటి తరానికి వివరించడంతో పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందన్నారు. విభజన కారణంగా
భారతీయులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల బాధ్యతగా
మెలగాలని సూచించారు. ప్రధాని మోదీ 2021 లో ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని
ప్రతి ఏడాది ఆగస్టు 14న నిర్వహిస్తున్నట్లు వివరించారు.