చంద్రయాన్-3 జాబిల్లికి మరింత
దగ్గరైంది. వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు
ఇస్రో వెల్లడించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్
నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని
ఆగస్టు 16న ఉదయం 8.30 కు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే
చంద్రుడి పై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత ప్రొపల్షన్
మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుంది. అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23న
చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది.
చంద్రయాన్-3ని జులై 14న భూ కక్ష్యలో
ప్రవేశపెట్టిన తర్వాత మరుసటి రోజు తొలిసారి కక్ష్య పెంచారు. ఇలా 18 రోజుల
వ్యవధిలోదశలవారీగా ఐదుసార్లు కక్ష్య పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తి అయిన తర్వాత
చంద్రుడి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి
ప్రవేశపెట్టారు. క్రమంగా కక్ష్యను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేస్తున్నారు.