దేశ విభజన సందర్భంగా జరిగిన నష్టాన్ని,
ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రధాని నరేంద్రమోదీ స్మరించుకున్నారు. భారత్ ,
పాకిస్తాన్ విభజనతో 1947లో జరిగిన అల్లర్లలో ఎంతో
మంది భారతీయులు ప్రాణాలు ఆర్పించారు. వారందరి గుర్తుగా ఆగస్టు 14 న విభజన
గాయాల సంస్మరణ దినాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ 2021లో పిలుపునిచ్చారు.
దేశ విభజన సమయంలో ప్రజలు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారని మరెన్నో త్యాగాలు చేశారని
వాటిని గుర్తుచేసుకునేందుకు సంస్మరణ దినం నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఇవాళ సంతాపం
తెలిపారు.
విభజన గాయాల సంస్మరణ దినోత్సవాన్ని
పురస్కరించుకుని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. అఖండ భారత్ కోసం ప్రాణాలర్పించిన
వారికి సెల్యూట్ అని పేర్కొన్నారు. దేశ విభజన సందర్భంగా ప్రాణత్యాగం చేసిన వారికి
భక్తి పూర్వక నివాళులు ప్రకటించారు.
అనాలోచిత, అశాస్త్రీయ విభజన కారణంగా అప్పట్లో
ఎంతోమంది జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. విభజన సృస్టించిన అల్లర్లు, హింస కారణంగా
ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, మరిఎంతో మంది రోడ్డున పడ్డారు.