ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో అరాచకం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కిరాతకంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన ఓ వ్యాపారవేత్తకు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఇటీవల ఆమె ఇన్‌స్టా ఖాతాలో ఫాలోవర్స్ ఎక్కువయ్యారని గుర్తించాడు. అంతేకాదు…తనను
అన్‌ఫాలో చేయడంతో భార్యపై మరింత అనుమానం పెంచుకున్నాడు. దీనిపై వారిద్దరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. చివరకు గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన దేశ
వ్యాప్తంగా సంచలనంగా మారింది.
భార్యా, భర్తల మధ్య గత కొంతకాలంగా ఇన్‌స్టా విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం వారి ఇద్దరి పిల్లలు, భార్యతో కలసి కారులో బయటకు వెళుతుండగా
వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. వెంటనే పిల్లల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. కారులో అలాగే లాక్ చేసుకుని చాలా సమయం అక్కడే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి పరిశీలించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని చంపినట్టు పిల్లలు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.