Monday, December 11, 2023

Odisha-365
upload upload upload

Lok Sabha

 క్యాష్ ఫర్ క్వెరీ : మహువా  లోక్‌సభ  సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు 

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ అందజేసిన నివేదిక, లోక్‌సభ ముందుకు వచ్చింది. బీజేపీ, ఎంపీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోన్కర్ లోక్ సభలో దీనిని ప్రవేశపెట్టారు. లోక్‌సభ నియమావళికి వ్యతిరేకంగా ఆమె వ్యవహరించినందున మహువా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది.

ఎథిక్స్ నివేదిక కమిటీ నివేదిక కాపీలను తమకు ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఓటింగ్ జరగడానికి ముందు చర్చ జరపాలని నినదించారు. సమావేశాలకు అంతరాయం కల్పించడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

ఈ నివేదికను లోక్‌సభ ఆమోదిస్తే మహువా, బహిష్కరణకు గురవుతారు. లోక్‌సభ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మహువా, ‘ వినాశనం సంభవించినప్పుడు తొలుత కనుమరుగు అయ్యేది వివేకమే, మహాభారత యుద్ధాన్ని’ చూస్తారంటూ వ్యాఖ్యానించారు.

T Ramesh | 13:34 PM, Fri Dec 08, 2023

పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే: లోక్‌సభలో అమిత్ షా

Amit Shah says in Lok Sabha that PoK is ours

మూడవరోజు పార్లమెంటు సమావేశాల్లో జమ్మూకశ్మీర్‌ పునర్విభజన (సవరణ) బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్లు (సవరణ) బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని వ్యాఖ్యానించారు.

జమ్మూకశ్మీర్ శాసనసభలో రెండు సీట్లు కశ్మీరీ శరణార్థులకు, ఒక సీటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి తరిమివేయబడిన వారికి కేటాయిస్తామని అమిత్ షా లోక్‌సభకు చెప్పారు. మొదటిసారిగా జమ్మూకశ్మీర్ శాసనసభలో 9 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్నామన్నారు.

ఆ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే అన్నారు. దేశ ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ తప్పిదం వల్లే పీఓకే అంశం వివాదాస్పదమైందని వ్యాఖ్యానించారు. ‘‘పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ నిర్ణయం వల్ల రెండు తప్పులు జరిగాయి. మొదటిది, మన సైన్యం గెలిచే దశలో ఉన్నప్పుడు యుద్ధవిరమణ ప్రకటించారు. ఆ ప్రకటన మరో మూడురోజుల తర్వాత చేసి ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇవాళ భారత్‌లో అంతర్భాగంగా ఉండేది. ఇక రెండో తప్పు, మన అంతర్గత విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్ళడం’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ రెండు తప్పుల వల్లా జమ్మూకశ్మీర్ ప్రజలు ఇన్నేళ్ళుగా బాధలు పడుతూనే ఉన్నారని అమిత్ షా లోక్‌సభలో చెప్పారు.

నెహ్రూ మీద అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేసారు.

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అమిత్ షా చెప్పుకొచ్చారు. 370వ అధికరణాన్ని రద్దుచేసాక జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 370 అధికరణం రద్దు తర్వాతనే 2021లో జమ్మూకశ్మీర్‌లోని మొట్టమొదటి మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగిందని గుర్తుచేసారు. ఆ తర్వాత కశ్మీర్ లోయలో వందకు పైగా సినిమాల షూటింగ్‌లు జరిగాయనీ, వందకు పైగా సినిమా థియేటర్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలిచ్చే ప్రక్రియ సాగుతోందనీ వివరించారు.

ఈ చర్చ మంగళవారం మొదలుపెట్టినప్పుడు డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గోమూత్రానికి ప్రాధాన్యతనిచ్చే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ గెలవగలదనీ, దక్షిణభారతంలో ఆ పార్టీకి తావు లేదనీ వ్యాఖ్యలు చేసారు. తీవ్ర వివాదానికి దారి తీసిన ఆ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ సభ రికార్డులలోనుంచి తొలగించారు. అంతకుముందు సెంథిల్ కుమార్, తన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూ వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు లోక్‌సభలో చెప్పారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.

P Phaneendra | 18:03 PM, Wed Dec 06, 2023

విస్మృతకశ్మీరీలకు న్యాయం కోసమే బిల్లులు: అమిత్ షా

JK Bills for justice to those ignored, says Amit Shah

జమ్మూకశ్మీర్‌లో ఇన్నాళ్ళూ అన్యాయాలకు గురైనవాళ్ళు, అవమానాలు ఎదుర్కొన్నవాళ్ళు, అన్నిరకాలుగా విస్మరించబడిన వాళ్ళకు హక్కులు కల్పించే ఉద్దేశంతోనే రెండు బిల్లులు చేసామని, వాటిని ఆమోదం కోసం లోక్‌సభ ముందు ఉంచామనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023... జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023 లపై లోక్‌సభలో చర్చకు ఇవాళ జవాబిస్తూ హోంమంత్రి, స్వదేశంలోనే శరణార్థులుగా బలవంతంగా మార్చబడిన వారికి  న్యాయం కల్పించడమే ఆ రెండు బిల్లుల లక్ష్యమని వివరించారు. ‘‘ఈ రెండు బిల్లులపై చర్చలో పాల్గొన్న సభ్యులు ఎవరూ వాటి మౌలిక తత్వాన్ని వ్యతిరేకించకపోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అమిత్ షా.

ఒకరికి హక్కులు కల్పించడం, ఆ హక్కులను సరైన మర్యాదతో కల్పించడం మధ్య చాలా తేడా ఉందని హోంమంత్రి అన్నారు. ‘‘నేను సభ ముందు ప్రవేశపెట్టిన బిల్లు ఉద్దేశం ఇన్నాళ్ళూ అన్యాయం జరిగిన వారికి, అవమానాలు ఎదుర్కొన్న వారికి, ఇన్నాళ్ళూ విస్మరించబడిన వారికి వారి హక్కులు కల్పించడం, వారికి న్యాయం చేయడమే. భారత రాజ్యాంగపు మౌలిక ఉద్దేశం అదే కదా. అదే సమయంలో ఆ హక్కులు వారి ఆత్మగౌరవాన్ని తగ్గించేలా ఉండకూడదు. హక్కులు ఇవ్వడానికీ, హక్కులు మర్యాదపూర్వకంగా ఇవ్వడానికీ మధ్య చాలా తేడా ఉంది. కాబట్టి బలహీనమైన, అణచివేయబడిన వర్గాన్ని ఇతర వెనుకబడిన తరగతిగా పిలవడం సమంజసంగా ఉంటుంది’’ అని అమిత్ షా చెప్పారు.

పేదల బాధలు ఎలా ఉంటాయో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలుసని అమిత్ షా చెప్పుకొచ్చారు. ‘‘కొంతమంది దీన్ని తక్కువ చేసి చూపాలని ప్రయత్నించారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే అని మరికొందరు అన్నారు. వాళ్ళకు నేను చెప్పేది ఒకటే. వారిపట్ల మనకు కనీస సానుభూతి ఉంటే, వారికి గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని సోదరులుగా భావించి, వారిని కూడా ఎదగనివ్వాలని కోరుకునే వారికే ఆ విషయం అర్ధమవుతుంది. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని ఓటుబ్యాంకుగా చూసేవారికి అర్ధం కాదు. నరేంద్ర మోదీ ఒక పేద కుటుంబంలో పుట్టి, ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగిన నాయకుడు. పేదల బాధలు ఆయనకు బాగా తెలుసు’’ అని అమిత్ షా చెప్పారు.

ఈ బిల్లులలో ఒకటి జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ చట్టం 2004ను సవరించడానికి ఉద్దేశించినది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, సామాజికంగానూ-విద్యాపరంగానూ వెనుకబడిన ఇతర తరగతుల వారికి విద్యాసంస్థల్లో ప్రవేశాలు, నియామకాల్లో రిజర్వేషన్ కల్పించడం ఆ చట్టం ఉద్దేశం.ఆ చట్టంలోని సెక్షన్ 2ను సవరించాలన్నది ప్రస్తుత ప్రతిపాదన. ఆ సెక్షన్‌లో ఉన్న ‘బలహీనమైన, పట్టించుకోకుండా ఉన్న సామాజికవర్గాలు’ అన్న పదాన్ని ‘ఇతర వెనుకబడిన తరగతులు’ అన్న పదంగా సవరించాలన్నది ప్రస్తుత ప్రతిపాదన.

మరో బిల్లులో ‘కశ్మీరీ వలసదారులకు’, ‘పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ నుంచి తరిమివేయబడిన వారికి’, జమ్మూకశ్మీర్ శాసనసభలో షెడ్యూల్డు తెగలుగా గుర్తించబడిన వారికి... తమ రాజకీయ హక్కులను పరిరక్షించుకునే హక్కు, మొత్తంగా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా సవరణ ప్రతిపాదించారు.

దాని ప్రకారం, జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2019లో సెక్షన్ 15ఎ, 15బి అనే రెండు కొత్త సెక్షన్లను ప్రవేశపెడతారు. కశ్మీరీ వలసదారుల నుంచి ఒక మహిళ సహా ఇద్దరు సభ్యులను, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భూభాగం నుంచి తరిమివేయబడిన వారి నుంచి ఒక సభ్యుడిని నామినేట్ చేయడానికి ఆ సెక్షన్లు వీలు కల్పిస్తాయి.

ఈ రెండు బిల్లులపై లోక్‌సభలో మంగళవారం చర్చ మొదలైంది. ఆ చర్చలో 29మంది సభ్యులు పాల్గొన్నారు.

P Phaneendra | 17:27 PM, Wed Dec 06, 2023

లోక్‌సభలో నేడు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ

లోక్‌సభలో ఇవాళ మహిళలకు చట్టసభల్లో ప్రవేశానికి 33శాతం రిజర్వేషన్లు కేటాయించే బిల్లుపై చర్చ జరగనుంది. ‘నారీ శక్తి వందన్ అధినియమ్‌’ బిల్లును దిగువసభలో నిన్న మంగళవారం నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు.

లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభమయ్యే 11 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకూ ఈ బిల్లుపైనే చర్చ కొనసాగుతుందని మేఘ్వాల్ ఈ ఉదయం వెల్లడించారు. ఈ బిల్లు రాజకీయ సంబంధమైనది కాదని తేల్చిచెప్పారు.

ఈనాటి సభాకార్యకలాపాలకంటె ముందు ప్రతిపక్ష భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి సమావేశం కానుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఈ కూటమి పార్టీల సమావేశం జరగనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వైఖరి గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పెర్సన్ సోనియాగాంధీ, ఈ చర్చలో తమ పార్టీ తరఫున పాల్గొంటారని సమాచారం.    

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార పక్షం వైఎస్‌ఆర్‌సీపీ ఈ బిల్లుకు పూర్తిగా మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ కూడా ఈ బిల్లును స్వాగతించింది.

P Phaneendra | 10:57 AM, Wed Sep 20, 2023
upload

Crime News

K Venkateswara Rao | 09:53 AM, Sun Dec 10, 2023
upload